Sania Mirza Divorce:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విడాకుల వార్త మరోసారి మొదలైంది. ఈ సారి షోయబ్ మాలిక్ స్వయంగా ఈ వార్తలను ప్రచారం చేశారు. దీనికి కొన్ని నెలల ముందు కూడా వారి విడాకుల వార్తలు షికారు చేశాయి. ఇద్దరూ విడిపోయారని పుకార్లు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లు షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ మార్పుతో వార్త ముఖ్యాంశాల్లో నిలిచింది.
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో అంతకు ముందు రాసిన వ్యాఖ్యను మార్చారు. పాకిస్థానీ క్రికెటర్ ఇన్‌స్టా బయోలో “సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్త” అని రాసి ఉంది. ఇప్పుడు ఆ బయోని మాలిక్ మార్చేశాడు. అతను ఇప్పుడు సానియా మీర్జా భర్త అని తన బయో నుండి తొలగించాడు. వీరిద్దరి మధ్య విడాకులు తీసుకున్నట్లు పలు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. దీనికి సంబంధించి షోయబ్, సానియాల తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
షోయబ్ మాలిక్ సానియా మీర్జాను మోసం చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ ఎఫైర్ నడుపుతున్నాడు. షోయబ్, అయేషా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వైరల్ చిత్రాల గురించి నటి అయేషా మాట్లాడుతూ.. ఇవి ఒక ప్రకటన కోసం తీసిన చిత్రాలని పేర్కొంది.
2010లో పెళ్లయింది
సానియా, షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ దాదాపు 5 నెలల పాటు డేటింగ్లో ఉన్నారని సమాచారం. అక్టోబర్ 30, 2018 న షోయబ్, సానియా ఓ బాబుకు జన్మనిచ్చారు. షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకునే ముందు, సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్‌తో నిశ్చితార్థం చెడిపోయింది.