»Chandrababu Naidu Comments On Ys Jagan On Farmers And Polavaram Project
Chandrababu naidu: జగన్ తప్పుడు లెక్కలు చూపించడంలో సిద్ధహస్తుడు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఖర్చు, చూపిస్తున్న లెక్కలకు సంబంధం లేదని ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిచారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా మంచిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీయే ఏకంగా లక్ష్యంగా జగన్(ys jagan mohan reddy) పాలన చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపించడంలో ఆయన సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. రూ.672 కోట్లకుపైగా లెక్కలు చూపించి కేవలం రూ.47 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏదైనా పంట వేసే రైతు బాగున్నాడా అంటూ ప్రశ్నించారు. గుంటూరు అనగానే మిర్చి, కర్నూల్లో పత్తి, సీమలో వేరుశనగ, ఉత్తరాంధ్రలో జీడిపంటలు సహా అనేక మంది రైతులు ఒక్కరైనా బాగుపడ్డారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఏపీలో జగన్ అరాచక పాలన వల్ల రాయలసీమలో వర్షాదార పంటలు ఎత్తిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటల గురించి అసలు ఆలోచించే పరిస్థితి లేదన్నారు. రైతుల(farmers)పై పూర్తి అవగాహన లేకుండా పూర్తిగా వారిని జగన్ నాశనం చేశారని అన్నారు. వ్యవసాయం గురించి పట్టించుకోకుండా 24 గంటలు ప్రతిపక్షాలపై పడి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులు జగన్ శని మాదిరిగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. అంతేకాదు అహంకారంతోనే జగన్ పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఈ ప్రాజెక్టు పూర్తైతే అన్ని జిల్లాలకు నీళ్లు వస్తాయని గుర్తు చేశారు.