BRO Movie Twitter Review: ప్రేక్షకులను కట్టిపడేసిన పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ యాక్టింగ్
సాయి ధరమ్ తేజ, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఓవర్సీస్లో సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. మూవీ బాగుందని చెబుతున్నారు.
BRO Movie Twitter Review: బ్రో సినిమాలో (BRO Movie ) సాయిధరమ్ తేజ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. సినిమా ఈ రోజు విడుదలైంది. పునర్జన్మ, ఆధ్యాత్మిక నేపథ్యంలో మూవీ సాగుతుందట. మూవీని తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఓవర్సీస్లో మూవీ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ బాగుందని కామెంట్స్ ట్వీట్ చేస్తున్నారు.
బ్రో మూవీ (BRO Movie ) బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. పాటలు బాగున్నాయని, మూవీ ఫీల్ గుడ్ అని అంటున్నారు. సాయిధరమ్ తేజను అద్దంలో చూపించే సీన్.. జీవితంలో ప్రాక్టికల్ గురించే చెప్పే విషయాలు చక్కగా ఉన్నాయని అంటున్నారు. సెకండాఫ్‌లో మాత్రం కొన్ని సీన్లు లాగినట్టు ఉన్నాయని.. బోరింగ్ అని మరికొందరు అంటున్నారు. ఆడియన్స్ ఎమోషనల్ అయ్యే సీన్లు పుష్కలంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఫెర్మార్మెన్స్ అదిరిందని కామెంట్స్ చేస్తున్నారు.
బ్రో మూవీ (BRO Movie ) చూస్తూంటే పవన్.. తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలు గుర్తుకు వచ్చాయని మరొకరు రాశారు. కొన్ని సీన్లును పిల్లలు ఎంజాయ్ చేస్తారని రాశారు. థమన్ మ్యూజిక్, బీజీఎం కేక అంటూ మరొకరు అభిప్రాయ పడ్డారు.