»Arunachal Schools Closed Till August 2nd 2023 Conjunctivitis Issue
Schools closed: ఆగస్టు 2 వరకు స్కూల్స్ బంద్..ఎందుకంటే
ఈ రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాలు మాత్రం కారణం కాదని తెలిపారు. కండ్ల కలక వ్యాప్తి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లోని పలు పాఠశాలలు బంద్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
అరుణాచల్ ప్రదేశ్(arunachal pradesh)లో కండ్లకలక(Conjunctivitis) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి బారిన పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్, లాంగ్డింగ్ జిల్లాలోని కనుబారి సబ్-డివిజన్లలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని నంసాయ్, తూర్పు సియాంగ్ అధికారులు స్పష్టం చేశారు. తూర్పు సియాంగ్లోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ఆగస్టు 2 వరకు తాత్కాలికంగా మూసివేయబడతాయని ప్రకటించారు. అయితే నామ్సాయిలోని విద్యా సంస్థలలో స్కూల్స్(schools) బంద్ జూలై 31 వరకు మాత్రమే ఉంటాయని అక్కడి అధికారి తెలిపారు.
జిల్లా నిఘా విభాగాలు నిర్వహించిన సమగ్ర సర్వేలో కండ్లకలక(Conjunctivitis) కేసులు పెరుగుతున్నాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిల్లా వైద్యాధికారి జారీ చేసిన మార్గదర్శకాలు, సలహాలను శ్రద్ధగా పాటించాలని అధికారులు కోరారు. కండ్లకలకను సాధారణంగా పింక్ ఐ అని పిలుస్తారు. కంటి స్రావాలు, కలుషితమైన వస్తువులు లేదా సోకిన వ్యక్తుల నుంచి శ్వాసకోశ బిందువులతో ప్రత్యక్ష లేదా పరోక్ష పరిచయం ద్వారా వ్యాప్తి చెందుతాయి.
పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఇతర సోకిన వ్యక్తులను ఒంటరిగా ఉంచుకోవాలని, తదుపరి వ్యాప్తిని నివారించడానికి తమను తాము నిర్బంధించుకోవాలని జిల్లా యంత్రాంగం(officers) ఆదేశాలు జారీ చేసింది. దిగువ దిబాంగ్ వ్యాలీలోని వివిధ పాఠశాలల పరిధిలో 100 కంటే ఎక్కువ కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా వైద్యులు జారీ చేసిన ప్రజారోగ్య సలహాలు తరచుగా చేతులు కడుక్కోవడం, కళ్లను తాకడం, వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం, సోకిన వారికి దూరంగా ఉండటం వంటివి పాటించాలని ప్రజలకు సూచించారు.