ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) సొంత జిల్లాలో దారుణం జరిగింది. శవంతో వాగు దాటేందుకు ప్రజలు అనేక ఇబ్బందులుకిగురియ్యారు. సిద్దిపేట జిల్లా(Siddipet District) చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో బాలయ్య అనే అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు.దీంతో అతడి అంత్యక్రియలు (funeral) చేయడానికి బంధువులు, స్థానికులు బయలుదేరారు. అయితే ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో స్థానికంగా ఉన్న వాగు ఉప్పొంగుతోంది. అయితే స్మశాన వాటిక వాగుకు అవతలిపక్క ఉండటంతో బంధువులు నానా తంటాలు పడి వాగు దాటుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. ‘‘సీఎం సొంత జిల్లాలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు’’ అంటూ బీజేపీ నేతలు (BJP Leaders) విమర్శిస్తున్నారు. కాగా ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అయితే ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి (Bridge) నిర్మించేందుకు సర్కారు నిథులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్లు (Contractors) ముందుకు రావడంలేదు. అక్టోబర్లో ఒప్పందం ఉండటంతో పనులు అప్పుడే మొదలవుతాయని అంటున్నారు.
సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట చేర్యాల మండలంలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు. pic.twitter.com/HbaXXvK6Ac
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) July 26, 2023