అన్నమయ్య జిల్లా(Annamaya District) లో రోడ్డు ప్రమాదం ఘోర ప్రమాదంచోటుచేసుకుంది. పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు(RTC bus), ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతి(Tirupati)కి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది.
దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ (Lorry driver) అతి వేగమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట(Rajampet)- తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(police) ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలోమృతి చెందిన వారిని బుడ్డయ్య, శేఖర్, బాషాతో పాటు మరో ఇద్దరు మహిళలుగా గుర్తించారు