నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఆక్సిజన్ అందక పోవడం వల్లే ఆ చిన్నారులు చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఆ ఆరోపణలను ఖండించాయి. అనారోగ్య కారణాల వల్లే చిన్నారులు చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది లేదని, మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. చిన్నారుల మరణ వార్తతో కుటుంబీకుల్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలు బోరున విలపించడంతో అక్కడున్నవారంతా కన్నీటిపర్యంతమయ్యారు.