ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అంటూ.. నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. ప్రముఖ హాలీవుడ్ వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో.. టాప్ 10లో ఎన్టీఆర్ పేరును ప్రకటించింది. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ తారక్‌కు మాత్రమే సొంతమైంది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఆస్కార్ వస్తే మాత్రం.. తెలుగోడిగా అంతకు మించిన గర్వకారణం మరోటి ఉండదని చెప్పొచ్చు. ఆస్కార్ రేసులో తారక్ ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్‌తో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి మరో న్యూస్ వైరల్‌గా మారింది. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో.. ఎన్టీఆర్ 30 షూటింగ్లో జాయిన్ అవబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌ను కీలక పాత్ర కోసం ట్రై చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనుకున్న అమీర్.. తారక్ కోసం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 31లో నటించేందుకు దాదాపు ఓకే చెప్పినట్లు టాక్. అమీర్ కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దాంతో.. నిజంగానే ప్రశాంత్ నీల్.. అమీర్ ఖాన్‌ను సంప్రదిస్తే ఎన్టీఆర్ 31లో ఫిక్స్ అయిపోయినట్టేనని చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ అమీర్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలే అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.