టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విమర్శల వర్షం కురిపించాడు. చంద్రబాబుని హిట్లర్ తో పోల్చి దారుణంగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియోను పోస్టు చేశారు.
ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి జనాలు ఎక్కువ మంది వచ్చినట్లు చూపించుకోడానికి చేసిన ప్రయత్నాన్ని రాంగోపాల్ వర్మ తప్పుబట్టారు. కుక్కలను బిస్కెట్లు, మేకలకు దాణా పడేసినట్లు వాహనం నుంచి ప్యాకెట్లు పడేయడంపై ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ రాజకీయ నేతగా విపరీతమైన అనుభవం కలిగిన చంద్రబాబుకు ఇటువంటి సభలు నిర్వహిస్తే ఏం జరుగుతుందో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజల పాణాలు గడ్డిపోతతో సమానమని ఆర్జీవీ ఆరోపించారు. బాబుకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్పిస్తే వేరే విషయాలు పట్టవని విమర్శించారు.
ఎంత మంది చనిపోతే అంత గొప్పగా చంద్రబాబు ఫీలౌతున్నారని రాంగోపాల్ వర్మ అన్నారు. తన కోసం ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీ ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని ఆర్జీవీ అన్నారు. తన సభల కోసం వచ్చిన వాళ్లు చనిపోతుంటే..తనకేం సంబంధం లేనట్లుగా బాబు వ్యవహరించడం పట్ల కూడా రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. వేరే వాళ్లపై నిందను మోపడం సరికాదని అన్నారు.
ఇరుకు సందుల్లో మీటింగులు పెడితే ఏం జరుగుతుందో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియదని చెబితే ఏవరూ నమ్మరని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రజల ప్రాణాల కంటే పాపులారిటీ దక్కించుకోవడమే చంద్రబాబుకున్న ఏకైన లక్ష్యమని ఆర్జీవీ అన్నారు. ఇటువంటి సంఘటలనకు కారకుడైన చంద్రబాబును మీరు అని పిలవనని, నిన్ను అని సంభోదిస్తానని రాంగోపాల్ వర్మ అన్నారు.
ప్రజలను చంపి, వాళ్ల మీద నుంచొని పాపులారిటీ పొందడానికి ప్రయత్నించడం చాలా పెద్ద తప్పిదమని రాంగోపాల్ వర్మ అన్నారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత అంత పెద్ద నియంతవు నువ్వే అని చంద్రబాబును అన్నారు. ఇంత కంటే నిన్ను ఏం అనాలో నాకు అర్ధం కావడం లేదని రాంగోపాల్ ముగించారు.