అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా పంట నష్టం, సరఫరా ఇబ్బందుల నేపథ్యంలో టమాటా (Tomato) ఖరీదుగా మారింది. రిటైల్ గా కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అధిక ధర పలుకుతున్న పలుచోట్ల కేంద్రం రాయితీపై కిలో రూ.90కే విక్రయిస్తోంది.కర్ణాటక నుంచి ఓ యజమాని ఓ లారీలో టమాటాలను ఆదిలాబాద్ (Adilabad) మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నాడు. ఈ సమయంలో ఆదిలాబాద్ పట్టణంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై మావల వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై టమాటా బాక్సులు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందినకాడికి టమాటాలను ఎత్తుకెళ్లారు. ఒక్కొక్కరు కిలోల చొప్పున మోసుకెళ్లారు.
కొందరైతే బస్తాలు, బ్యాగులు తెచ్చుకుని వాటిల్లో నింపుకున్నారు.పోలీసులు(Police)తో టమాటాలకు సెక్యూరిటీ..ఓ వైపు టమాటాలను ప్రజలు ఎత్తుకెళ్తుండా..యజమాని లబోదిబో మన్నాడు. తీసుకెళ్లొద్దంటూ వేడుకున్నాడు. అయినా జనం వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..టమాటాలకు రక్షణ కల్పించారు. లారీ(Larry)లో టమాటాల విలువ రూ. 22 లక్షలు ఉంటుందని యజమాని తెలిపాడు.మండిపోతున్న టమాటా..దేశ వ్యాప్తంగా కొన్ని రోజులుగా టమాటాల ధర మండిపోతోంది. తెలంగాణ, ఏపీలో కిలో రూ. 120 నుంచి రూ. 180 వరకూ పలుకుతోంది. ఇక ఢిల్లీ(Delhi), గుర్గావ్, లక్నో లాంటి నగరాల్లో కిలో టమాటా రూ. 250 వరకూ విక్రయిస్తున్నారు. గతంలో టమాటాలకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి వెళ్లిన సంఘటనలు చూశాం. ఇప్పుడు అదే రోడ్డుపై పడిన టమాటాకు సెక్యూరిటీ (Security)ఏర్పాటు చేయడం గమనార్హం.