Wife: మహిళల్లో కూడా నేర ప్రవృత్తి పెరుగుతోంది. మీడియా.. సోషల్ మీడియా ప్రభావం ఏమో కానీ.. కొందరు భర్తలను ఉతికి ఆరేస్తున్నారు. చిన్న విషయాలకు గొడవ, అలక కామన్.. కానీ కొందరు ఉగ్రరూపం దాలుస్తున్నారు. భర్త తాగి వచ్చిన, గొడవ చేసిన అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో భార్యలు (Wife) చేసిన దాడుల్లో భర్తలు చనిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
చెంబుతో కొట్టి చంపి..
అంబేద్కర్ కోనసీమ (konaseema) జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకకు చెందిన ఇసుకుపట్ల రామకృష్ణ (ramakrishna)- సత్యనారాయణమ్మ (satyanarayanamma) దంపతులు.. రామకృష్ణకు (ramakrishna) మద్యం తాగే అలవాటు ఉంది. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. డ్రింక్ చేసిన రామకృష్ణ(34) (ramakrishna).. కూతురితో తప్పుగా ప్రవర్తించాడట. దీంతో అతని భార్య కోపంతో ఊగిపోయింది. తాగిన భర్తపై చెంబుతో బలంగా కొట్టింది. సున్నితమైన ప్రాంతంలో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకున్నారు. మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు.
జైలుకు భార్య
భర్త ఏదో అన్నాడని.. వేధించాడని సత్యనారాయణమ్మలో (satyanarayanamma) కసి పెరిగింది. క్షణికావేశంలో భర్తపై దాడి చేసింది. కోపంతో.. బలంగా కొట్టడంతో కట్టుకున్న భర్త చనిపోయాడు. ఇన్నాళ్లూ ఓర్పుకొని, భరించిన సత్యనారాయణ్మ (satyanarayanamma).. నిన్న మాత్రం ఉగ్రరూపం ప్రదర్శించింది. దాడి చేసి హతమార్చింది. ఇప్పుడు హంతకురాలిగా మారింది. ఆమె సంతానానికి దూరమై.. కటకటాల పాలయ్యింది. కట్టుకున్న భర్తనే కడతేర్చి.. మాయని మచ్చ తెచ్చుకుంది.
పెరిగిన నేర ప్రవృతి
సత్యనారాయణమ్మ (satyanarayanamma) ఉదంతంతో స్త్రీలలో నేర ప్రవృత్తి పెరిగింది అనడానికి ఉదహరణగా నిలుస్తోంది. ఇదివరకు కూడా కొందరు అగ్రెసివ్‌గా వ్యవహరించారు. కానీ ఇలా భర్తలపై దాడులు చేస్తూ.. హత్య చేయడంపై మేధావులు ఆందోళన చెందుతున్నారు. మృదువుగా ఉండే స్త్రీలు ఇలా కఠినంగా ఎందుకు తయారు అవుతున్నారని కోరుతున్నారు.