Pawan kalyan: ఓ రాజకీయ పార్టీ నడపాలంటే కావాల్సింది వేల కోట్లు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. డబ్బు ముఖ్యం కాదు.. ఎందుకోసం పార్టీ పెట్టాం, విధానాలు ఏంటీ, సైద్దాంతిక అంశాలు ఏంటీ అనేవి ముఖ్యం అని పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన వీర మహిళలతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల అప్పట్లో పార్టీ ఏర్పాటు చేశారని పవన్ (Pawan) చెప్పారు. వైఎస్ఆర్ టీపీ పేరుతో షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఆ రోజు తనకు శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ఇటీవల షర్మిల పార్టీ విలీనం గురించి వార్తలు విన్నానని తెలిపారు. అది తప్పో.. ఒప్పో తాను చెప్పడం లేదని.. పార్టీ నడపాలంటే మాత్రం వేల కోట్లు ఉండే సరిపోదని అన్నారు. సైద్దాంతిక బలం ఉంటేనే నడపగలం అని తేల్చిచెప్పారు.
అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయేవాడినని గుర్తుచేశారు. అలా కాదని.. సిద్దాంతాన్ని నమ్మి పార్టీని ఏర్పాటు చేశానని వివరించారు. సిద్దాంతాన్ని నమ్మితే చచ్చేవరకు పోరాడాలని పవన్ కల్యాణ్ (Pawan kalyan) గుర్తుచేశారు. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అదే విషయం చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు. సిద్దాంతాలతో ఉంటేనే పార్టీ నడపగలం అని తేల్చిచెప్పారు.