Boda Kakarakaya: బోడ కాకర (Boda Kakara).. కాకరకాయలా చేదు ఉండదు. మంచి రుచిగా ఉంటుంది. దీనిని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో లభిస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది.. మరీ ధర.. రేట్ కూడా ఎక్కువే. అవును కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఈ రెండు, మూడు నెలలే మార్కెట్లో ఉంటుంది. బోడ కాకర మంచిదని వైద్యులు, పెద్ద వారు చెప్పడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కిలో రూ.400
బోడ కాకర (Boda Kakara) ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించేది. ఇప్పుడు పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. 4, 5 రోజుల నుంచి మార్కెట్లో బోడ కాకర కనిపిస్తున్నాయి. ధర మాత్రం మాములుగా లేదు. కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు. బోడ కాకర (Boda Kakara) కొనాలని ఇష్టం ఉన్నప్పటికీ సామాన్యులు మాత్రం కొనుగోలు చేయలేని పరిస్థితి. బోడ కాకరతో చికెన్‌ను పోలిస్తే కేజీ చికెన్ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది. బోడ కాకర (Boda Kakara) మాత్రం రెట్టింపు ధర పలుకుతుంది.
పీచు పదార్థాలు ఎక్కువ
ఆరోగ్యానికి బోడ కాకర (Boda Kakara) మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బోడ కాకరలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ వల్ల కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా బోడ కాకర మేలు చేస్తోంది. షుగర్ వ్యాధి బాధితులకు మేలు చేస్తోందట.. షుగర్‌ని కంట్రోల్ చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొవ్వు తగ్గిస్తోంది
బోడ కాకర (Boda Kakara) తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి దోహదం చేస్తోంది. బోడ కాకర (Boda Kakara) తీసుకుటే షుగర్ కాదు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. బోడ కాకరలో (Boda Kakara) ఉండే ఫోలేట్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.
నీరసం తగ్గుతుంది
ఫెటో న్యట్రిషన్ కలిగిన బోడ కాకర శరీరం నుంచి నీరసం తగ్గిస్తోంది. రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ అజీర్ణాన్ని, మలబద్దకం, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యను తగ్గిస్తోంది. బోడ కాకర ల వల్ల యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయట. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి. గర్బిణీ స్త్రీలు కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు కూడా ఎదుగుతారట.