మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్‌లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy)ని ఇమిటేట్ చేశాడు హీరో నవీన్ పొలిశెట్టి. మల్లారెడ్డి స్టైల్లో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) స్పీచ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపైనే కాదు ప్రమోషన్స్(Promotions)లో కూడా తన పంచ్‌లు, ప్రాసలతో నవ్విస్తుంటాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్‌లో జాతిరత్నాలు(Jatiratnalu)’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన నవీన్ పొలిశెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty)తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరక్కెకిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
దీంతో ప్రస్తుతం ప్రమోషన్స్‌తో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి చాలా కష్టపడుతున్నాడు. తనదైన స్టైల్లో యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. ఓ ఇంజినీరింగ్ కాలేజీ(Engineering College)లో జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌కు నవీన్ పొలిశెట్టి హాజరయ్యాడు. మిస్టర్ మల్లారెడ్డి అంటే తనకు ఇష్టమని, ఆయన్ని కలవడానికే ఈ వేడుకకు వచ్చినట్లు నవీన్ పొలిశెట్టి అన్నారు. ఈ సందర్భంగా కష్టపడ్డా…ఇన్ని హిట్లు ఏడి కెళ్లివచ్చినయ్…ఎట్లొచ్చినయ్…నేనేమైనా మాయచేసినా…నేనేమైనా మంత్రం జేసిన్నా…కష్టపడ్డా. స్క్రిప్ట్‌లు రాశినా..యూట్యూబ్(Youtube)లో వీడియోలు తీసినా…అనుష్కతో హీరోగా జేసినా అంటూ మల్లారెడ్డి స్టైల్లో స్టేజ్‌పై స్పీచ్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు నవీన్ పొలిశెట్టి. మల్లారెడ్డిని ఇమిటేట్ చేస్తూ నవీన్ పొలిశెట్టి ఇచ్చిన స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#NaveenPolishetty's funny imitation on Minister Malla Reddy Garu had everyone bursting with laughter at the #LadyLuck song launch event at CMR College! 🤩