ట్విట్టర్ డేటాను ఉపయోగించుకొని థ్రెడ్స్ యాప్ ను తయారు చేసినట్లు ఎలాన్ మస్క్ తరపు న్యాయవాది అలెక్స్ స్పిరో మెటా సంస్థకు లేఖ రాశారు. తమ ఉద్యోగస్తులను నియమించుకొని ఈ యాప్ ను క్రియేట్ చేసినట్లు ఆరోపించారు. సరైన వివరణ ఇవ్వకుంటే కోర్టులో దావా వేస్తామంటు లేఖలో హెచ్చరించారు.
Twitter Copy Threads app.. Twitter letter to meta organization. Elon Musk angry at Mark Zuckerberg
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి ట్విట్టర్ గురించి తెలుసు. ఎలాన్ మస్క్ ఈ యాప్ కు సీఈఓ అయిన తరువాత చాలా మార్పులు చేశాడు. ఈ మార్పుల వలన యూజర్స్ లో కొంత గందరగోల పరిస్థతి ఏర్పిడింది. ఇలా గత కొన్ని రోజులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న ట్విటర్ (Twitter)కు ఇప్పుడు ‘థ్రెడ్స్ (Threads)’ యాప్ మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ అనే కొత్త యాప్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ కు విశేష ఆధారణ లభిస్తోంది. ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపు 5 కోట్లకు పైగా యూజర్లను ఈ యాప్ సొంతం చేసుకొంది. అయితే 24 గంటలు గడవకుముందే ఈ యాప్ చిక్కుల్లో పడింది. ‘థ్రెడ్స్’ యాప్ తమ టెక్నాలజీని కాపీ కొట్టిందంటూ ట్విట్టర్ ఆరోపణలు చేసింది. దీనిపై వివరణ ఇయ్యాలని లేదంటే న్యాయం కోసం కోర్టులో దావా వేయ్యాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో.. మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Zukerberg)కు లేఖ రాశారు.
ఈ లేఖను అమెరికాకు చెందిన ఓ ప్రముఖ సంస్థ బయటపెట్టింది. ఈ లేఖలో తెలిపిన వివరాల ప్రకారం..తమ సంస్థలోని ఉద్యోగులను నియమించుకొని తమ వ్యాపార రహస్యలతో పాటు ట్విట్టర్ పనుచేయి టెక్నాలజీని కాపీ కొట్టారంటూ పేర్కొంది. అసలైన యాప్ ట్విట్టర్ కు థ్రెడ్స్ యాప్ డూప్లీకేట్ అంటూ ఆరోపణలు చేసింది. ట్విట్టర్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయంటూ..మా సంస్థకు చెందిన వాణిజ్య, అంతరంగిక రహస్యాలను ఉపయోగించుకొని మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చిందని, ఇది డేటా అపహరణ కిందకే వస్తుందని లేఖలో రాసుకొచ్చారు. వెంటానే తమకు థ్రెడ్స్ యాప్ సంబంధించిన పూర్తి వివరణ అందించాలని లేదంటే న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని అలెక్స్ స్పిరో ఆ లేఖలో హెచ్చరించారు.
ట్విటర్ ఆరోపణలపై మెటా (Meta) స్పందించింది. ట్విట్టర్ ఉద్యోగస్తులను తాము నియమించుకోలేదని తమ డేటాను ఎక్కడ కాపీ చేయలేదని తీవ్రంగా ఖండించింది. థ్రెడ్స్ (Threads) ఇంజినీరింగ్ టీమ్ సొంత ఆలోచనతో ఈ యాప్ క్రియేట్ చేసినట్లు మెటా అధికార ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు. గురువారం నుంచి థ్రెడ్స్ యాప్ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ యాప్ కు యూజర్లుగా మారుతున్నారు. తెలుగు సెలబ్రెటీలు అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR) లు కూడా థ్రెడ్స్ యాప్ యూజర్లుగా మారారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ ట్వీట్ సంచలనంగా మారింది. పోటీ మంచిదే కానీ మోసం సరైంది కాదు అని రాసుకొచ్చారు. దీనిపై మార్క్ జుకర్ బర్గ్ ఏ విధంగా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అయితే మార్క్ 12 ఏళ్ల తరువాత గురువారం ఒక ట్వీట్ చేశారు. ఇద్దరు స్పైడర్ మేన్స్ ఉన్న ఇమేజ్ ను పోస్ట్ చేశారు. ఈ ఇమేజ్ లో నువ్వు డూప్లీకేట్ స్పైడర్ అని వేలితో చూపుతూ ఉంటుంది. ఈ ట్వీట్ ను బట్టి చూస్తే ఈ వివాదాన్ని మార్క్ ముందుగానే ఊహించి ఇలాంటి పోస్ట్ పెట్డాడని నెటిజనులు భావిస్తున్నారు.