»Breaking Supreme Court Notices To Vijayasai Reddy Jagathi And Bharti
Breaking: విజయసాయిరెడ్డి, జగతి, భారతిలకు సుప్రీం కోర్టు నోటీసులు
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
జగన్(Jagan) అక్రమాస్తుల కేసులో సుప్రీం(Supreme Court) పలువురికి నోటీసులు(Notice) జారీ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai reddy), జగతి పబ్లికేషన్స్(Jagati publication), భారతి సిమెంట్స్(Bharati cements)కు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI) విచారణ పూర్తి అయ్యేంత వరకూ కూడా ఈడీ(ED) విచారణ నిలిపివేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే.
సీబీఐ(CBI) ఛార్జీషీట్లపై తీర్పు వచ్చిన తర్వాతనే ఈడీ(ED) తన విచారణను చేపట్టాలని తెలిపింది. ఒక వేళ ఆ రెండు దర్యాప్తు సంస్థలు తమ విచారణను సమాంతరంగా జరిపితే సీబీఐ తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ తీర్పు ఇవ్వాలని హైకోర్టు(High Court) ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఈడీ ఫైర్ అయ్యింది. సవాల్ చేస్తూ ఈడీ..సుప్రీం కోర్టు(Supreme Court)లో నిలిచింది. దీంతో ఈడీ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సెప్టెంబర్ 5వ తేదీలోగా సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి(Vijayasai reddy), జగతి, భారతి సిమెంట్స్(Bharati cements) అధినేతలకు నోటీసులిచ్చింది.