విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చి.. 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్(animal)గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్టు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి వెళ్లిపోయిన సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌ని యానిమల్(animal)గా చూపించబోతున్నాడు. ఇప్పటికే యానిమల్ గ్లింప్స్‌తో అసలు సిసలైన వైలెంట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నట్టు చెప్పేశాడు సందీప్ రెడ్డి. దాంతో ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ సినిమా తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో ఉండబోతుందని వినిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఆగష్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఈ సినిమాను పోస్ట్ పోన్(postponed) చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి.
డిసెంబర్ 1న రణబీర్ కపూర్ విశ్వరూపం చూద్దాం.. థియేటర్స్‌కి రండి అంటూ సందీప్ రెడ్డి కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. ‘యానిమల్ సినిమా ఆగస్ట్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అవుతుంది. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. అంటే, మొత్తంగా అయిదు భాషల్లో 35 పాటలు అవుతాయి. అన్ని భాషల్లోను ఈ సాంగ్స్‌ను సెపరేట్‌గా ప్లాన్ చేస్తున్నాను. మిగతా భాషల్లో ఇది ఒక హిందీ డబ్బింగ్ సినిమా అని ప్రేక్షకులకు అనిపించకూడదు. పూర్తిగా ప్రాంతీయా చిత్రంలాగే అనిపించాలి. అందుకే ఇంకాస్త సమయం తీసుకుంటున్నాను. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అవుతుంది. ఆ రోజు థియేటర్స్‌కి రండి రణబీర్ కపూర్ విశ్వరూపం చూద్దాం. అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. ఈ లెక్కన యానిమల్‌ను ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా పై..రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.