»Breaking Ap Minister Escaped From Bee Attack 70people Injured
Breaking: ఏపీ మంత్రి బుగ్గనకు తప్పిన ప్రమాదం
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయనతో ఉన్న 70 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఏపీ ఆర్థిక మంత్రి(Ap Finance Minister) బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranadh)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన తేనెటీగల(Bees) దాడి నుంచి తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం ఆయన పర్యటించారు. ఆ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన ప్రతి గ్రామానికి పర్యటిస్తూ వస్తున్నారు.
ఈ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranadh) వెంట అధికారులు, వైసీపీ(YCP) నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా ఓ చెట్టు వద్ద నుంచి పనులను పరిశీలిస్తూ ఉన్నారు. అంతే ఒక్కసారిగా అక్కడున్నవారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకూ గాయాల పాలయ్యారు. అధికారులు బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.