KRNL: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, టమాటా, సెనగ, పొగాకు వంటి పంటలు వేసిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు.