»Akkineni Prince Akhil Akkineni Testing His Luck With Fantasy Entertainer
Akhil akkineni: కొత్త జోనర్ ట్రై చేస్తున్న అఖిల్..ఈసారైనా హిట్టు పడేనా?
అఖిల్ అక్కినేని(akhil akkineni) చాలా కాలంగా శుక్రవారం సక్సెస్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి కొత్త జోనర్ ట్రై చేయాలని అక్కినేని ప్రిన్స్ చూస్తున్నట్లు సమాచారం.
అక్కినేని వారసుడు అఖిల్(akhil akkineni) మంచి హిట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించాడు. కానీ మంచి హిట్టు మాత్రం ఇప్పటి వరకు పడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. ఇటీవల విడుదలైన ఏజెంట్ అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఏజెంట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఆయన మరిన్ని జాగ్రత్తలతో కొత్త ప్రాజెక్టులను ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లో అఖిల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి సహాయ దర్శకుడు ఆనంద్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫాంటసీ ఎంటర్టైనర్ అని, మేకర్స్ ఎలాంటి బడ్జెట్ పరిమితులను పెట్టుకోవడం లేదని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్(janhvi kapoor )ని హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫాంటసీ ఎంటర్టైనర్తో అఖిల్ సంచలనం సృష్టించగలడా అనే ప్రశ్నలు మొదలౌతున్నాయి. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్‌ను పవర్‌ఫుల్‌గా పెడుతున్నట్లు సమాచారం. కనీసం ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ అందుకుంటాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.