BDK: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మణుగూరు సమితి సింగారం BRS నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఇవాళ దగ్ధం చేశారు. అనంతరం పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపుమేరకు నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

