Samsung Galaxy Watches: సామ్సంగ్ (Samsung) మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ రిలీజ్ చేయనుంది. జూలై చివరలో మార్కెట్లోకి వస్తాయని కంపెనీ చెబుతోంది. ఇంతలో ఆ వాచ్ (watch) ఫీచర్లు లీకయ్యాయి. సామ్సంగ్ గలాక్సీ వాచ్ 6, సామ్సంగ్ గలాక్సీ వాచ్ 6 క్లాసిక్ వాచెస్ ఎక్సినొస్ డబ్ల్యూ 930 ఎస్వోసీ మీద రన్ అవుతాయి. న్యూ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ ఇస్తున్నారని తెలిసింది.
లీకయిన సమాచారం మేరకు గలాక్సీ 6 సిరీస్ వాచెస్ బ్యాటరీ సామర్థ్యం పెంచారు. గలాక్సీ వాచ్ 5 కన్నా 20 శాతం పెద్దగా ఉంటుందట. గలాక్సీ వాచ్ 6.. 40 ఎంఎం మోడల్ 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 44 ఎంఎం 425 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఇవ్వొచ్చు. 43 ఎంఎం గలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అదే 47 ఎంఎం అయితే 425 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
గలాక్సీ వాచ్ 6 గ్రాపైట్ గోల్డ్, గ్రాపైట్ సిల్వర్, గలాక్సీ వాచ్ 6 క్లాసిక్ గ్రాపైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది. ఎక్సినోస్ డబ్ల్యూ 930 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరెజ్ సామర్థ్యం ఉంటుంది. గలాక్సీ వాచ్ 6.. 26,600, క్లాసిక్ ధర రూ.37,600 వరకు ఉండొచ్చు. ఈ ఫీచర్లు, ధర వివరాలు అన్నీ ఆఫిషీయల్ కావు. టిప్ స్టార్ అంచనా ప్రకారం ధర ఇలా ఉంటాయట.