KMM: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 21న ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం తెలిపారు. ముస్తఫానగర్లోని వీవీసీ డెవలప్మెంట్ సెంటర్లో టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండి, 18-32 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని తెలిపారు.