ఇండియా(India)లో వరుస రైలు ప్రమాద ఘటనలు(Train accidents) చోటుచేసుకున్నాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటన(odisa Train Incident) మరువక ముందే వరుస రైలు ప్రమాదాలు పలు చోట్ల జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా(Agra) సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు(Goods Train) ట్రాక్టర్ ను ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
గూడ్స్ రైలు(Goods Train) ట్రాక్టర్ ను ఢీకొనడంతో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీఎక్స్ఆర్ స్పెషల్ గూడ్స్ రైలుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ రెస్టోరేషన్ రైలు ప్రమాద ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి బావుందని అధికారులు తెలిపారు.
జూన్ 21న విజయనగరంలోనూ గూడ్స్ రైలు(Goods Train) పట్టాలు తప్పిన ఘటన జరిగింది. ఒడిశా రైలు ప్రమాదం(odisa Train Incident) తర్వాత తరచుగా గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల పెద్ద నష్టమేమీ జరగలేదు. అయితే వరుస రైలు ప్రమాదాలు(Train accidents) చోటుచేసుకుంటూ ఉండటంతో రైల్వే ప్రయాణికులు(Train Passengers) ఆందోళన చెందుతున్నారు.