ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో నేడు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఖరీదైన మాయోగ్రఫీ టెస్ట్ ఉచితంగా చేస్తారని చెప్పారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని రావాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.