»Pooja Hegde Out In Guntur Kaaram Meenakshi Chaudhary Join
Guntur Karam: పూజా ఔట్..’గుంటూరుకారం’లో హిట్ బ్యూటీ!?
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) నటిస్తున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. రోజు రోజుకి సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడు.. హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు పూజా ప్లేస్‌ను శ్రీలీల రీ ప్లేస్ చేయగా.. శ్రీలీల ప్లేస్ కోసం మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.
గుంటూరు కారం(Guntur Kaaram)పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. రీసెంట్‌గానే క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అయినా కూడా గుంటూరు కారం పై రూమర్స్ ఆగడం లేదు. ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja hegde), శ్రీలీల(sreeleela)ను హీరోయిన్లుగా తీసుకున్నారు. పూజా హెగ్డే పై కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా.. మధ్యలోనే పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇందులో నిజం లేదని అనుకున్నారు. కానీ గుంటూరు కారం షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండడంతో.. డేట్స అడ్జెస్ట్ చేయలేక పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్గా టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. దాంతో సెకండ్ లీడ్ శ్రీలీల ప్లేస్‌లో మరో యంగ్ బ్యూటీని తీసుకునేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ఈ క్రమంలో సంయుక్త మీనన్‌ను దాదాపు ఫైనల్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల హిట్2 సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి(meenakshi chaudhary)ని హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. కానీ అసలు ఈ రూమర్స్‌లో ఎంత వరకు నిజముంది? అనేది మేకర్స్‌కు మాత్రమే తెలియాలి. అన్నట్టు గుంటూరుకారం లేటెస్ట్ షెడ్యూల్‌ను జూన్ 24 నుంచి స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. గుంటూరు కారం పై పుకార్లు మాత్రం ఆగడం లేదు.