»Narayana Co Trailer Trailer Of Narayana And Co Launched By Hero Vishwak Sen
Narayana & Co Trailer: హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసిన ‘నారాయణ అండ్ కో’ ట్రైలర్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల 'నారాయణ అండ్ కో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్(Tollywood) హీరో సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula) ‘నారాయణ అండ్ కో’ అనే మూవీ(Narayana & Co Movie) చేస్తున్నాడు. ఈ చిత్రానికి చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
‘నారాయణ అండ్ కో’ Movie ట్రైలర్:
‘నారాయణ అండ్ కో’ మూవీ(Narayana & Co Movie) ట్రైలర్ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథతో పాటుగా ఫన్ ఎలిమెంట్స్తోటి ఈ చిత్రం సాగనుంది. ఇందులో నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ నటిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని కనిపిస్తోంది. హీరో సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula), పూజా కిరణ్, యామినితో పాటు మరికొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీని పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి మూవీకి సంగీతం అందిస్తున్నారు. పూజా కిరణ్, జయ్ కృష్ణ, సప్తగిరి, అలీరెజా, రాగిణి, అనంత్ వంటివారు ఈ మూవీ(Narayana & Co)లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్(Trailer) అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.