Thalapathy Vijay: స్టార్ డమ్ కి కేరాఫ్ అడ్రస్..హ్యాపీబర్త్ డే లియో స్టార్ విజయ్..!
ఈ రోజు జూన్ 22న తలపతి విజయ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్(thalapathy Vijay) అభిమానులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
తమిళ చిత్రసీమలో కొత్తతరం సూపర్‌స్టార్ తలపతి విజయ్(thalapathy Vijay). అతనిని ‘సూపర్ స్టార్’ అని పిలవడం చాలా మందికి అంగీకరించకపోవచ్చు. కానీ, విజయ్ తన భారీ అభిమానుల ఫాలోయింగ్ , అతని చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్ల తో ‘సూపర్ స్టార్’ హోదాను సంపాదించాడు. అతని ప్లాప్ మూవీవలు కూడా ఓపెనింగ్ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇది ఒక్కటి చాలు అతను స్టార్‌గా ఎంత ఎదిగాడో చెప్పడానికి. విజయ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తన అభిమానులతో మమేకమవుతూ వారిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇటీవల అతను 10 ,12వ తరగతి విద్యార్థుల టాపర్లను కలుసుకున్న సంఘటన, అతను వారి కుటుంబాలతో గడిపిన సమయం అతను తమిళ ప్రేక్షకుల హృదయాలలో ఎంత లోతుగా ఎదిగాడో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో విజయ్ ఒకరు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలుగులో చిరంజీవితో వంటి స్టార్ హోరో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన కారణంగా సినిమా నేపథ్యంతో విజయ్ సినిమాల్లోకి ఈజీ అయిపోయాడు. కానీ, అతను తన కెరీర్‌ను మలచుకున్న విధానం, మాస్లో ‘తలపతి’గా రూపుదిద్దుకున్న తీరు మాత్రం స్ఫూర్తిదాయకం.
విజయ్ తన పదేళ్ల వయసులో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. 18 ఏళ్లు వచ్చే వరకు బాల నటుడి పాత్రలు చేస్తూనే, ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించాడు. అతను పూవే ఉనక్కగా (తెలుగులో శుభకాంక్షలు)తో తన మొదటి సినిమా చేశాడు. 2000 వరకు డజనుకు పైగా సూపర్-హిట్ చిత్రాలను అనుసరించాడు. నేరుక్కు నేర్, కధలుక్కు మరియాదై, ప్రియముదన్, తుల్లధ మనముం తుల్లుం, మిన్సార కన్నా, కుషి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.
2000 తర్వాత, విజయ్ తన స్టార్‌డమ్‌ను మరింత పెంచే చిత్రాలను ఎంచుకోవడం ప్రారంభించాడు. గిల్లి (తమిళంలో ఒక్కడు రీమేక్). గిల్లి అనేక రికార్డులను సృష్టించింది. దేశీయ మార్కెట్లో 50 కోట్లను దాటిన మొదటి తమిళ చిత్రం. ఆ తర్వాత పోక్కిరి (తమిళంలో పోకిరి రీమేక్), తిరుపాచి (తెలుగులో అన్నవరం), శివకాశి వంటి చిత్రాలతో విజయ పరంపర కొనసాగించాడు. ఈ సినిమాలతో తమిళ చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని ప్లాప్ లు కూడా వచ్చాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ కావలన్, వేలాయుధం , నన్బన్ (3 ఇడియట్స్ రీమేక్)తో మంచి విజయాలు సాధించాడు. కానీ, దర్శకుడు మురుగదాస్‌తో కలిసి పని చేయడం అతన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. వారి మొదటి చిత్రం తుపాకితో మరోసారి విజయ్ సత్తా చాటాడు.
ఆ తర్వాత విజయ్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో కలిసి చేరాడు. అక్కడ అతని పూర్తి సామర్థ్యాన్ని అట్లీ ఉపయోగించాడు. థేరి, మెర్సల్ బిగిల్తో వరుస బ్లాక్బస్టర్లను అందించాడు. ఆ తర్వాత విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సంవత్సరం విజయ్ తెలుగు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మించి దర్శకత్వం వహించిన వరిసు/వారసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు మళ్లీ లోకేష్ కనగరాజ్‌తో LEOగా వస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.