KMR: నిజాంసాగర్ మండలం మార్పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా NH-161పై శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో మూడు ట్రాక్టర్లు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై శివకుమార్ హెచ్చరించారు.