AP: విశాఖ లైట్హౌస్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, సురేష్ గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘విశాఖలో ఇండియాషిప్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తాం. విశాఖలో లైట్ హౌస్ మ్యూజియంను అభివృద్ధి చేస్తాం. అస్సాంలో 4 నూతన లైట్హౌస్లు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.