కోనసీమ: తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (TNTUC) రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ని మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించే వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ వినతి పత్రంలో అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రస్తావించారు.