WNP: సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులు ఉండటంతో చాలామంది కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ఏ పరిస్థితిని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. పండగల సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.