కోనసీమ: దళిత చైతన్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజోలు గ్రామానికి చెందిన బొడ్డపల్లి ప్రసాద్ నియమించబడ్డారు. ఈ మేరకు రాజోలు పట్టణంలో శనివారం జరిగిన దళిత చైతన్య వేదిక కార్యవర్గ సమావేశంలో బొడ్డపల్లి ప్రసాద్‌ను ఏకగ్రీవంగా నియమించినట్లు తీర్మానం చేశారు. దళిత జాతి జాగృతికి నిరంతరం పని చేస్తున్న దళిత చైతన్య వేదిక నియమ నిబంధనలను అనుసరించి పనిచేయాలన్నారు.