ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, తొలి మ్యాచ్‌లో స్మృతి మంధాన టీమ్ చేతిలో ఓడిన హర్మన్ సేన.. ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ జట్టుపై విజయం సాధించాలని భావిస్తోంది.