VZM: యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సూచించారు. యువజన దినోత్సవం సందర్భంగా గురజాడ కళాక్షేత్రంలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివేకానందుని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని అన్నారు.