»Manu Charitra Movie Team Exclusive Interview Shiva Kandukuri Producer Raj Kandukuri Hit Tv
Manu Charitra Movie : మా నాన్నే నాకు స్ఫూర్తి అంటోన్న హీరో శివకందుకూరి..మనుచరిత్ర గురించి ఏం చెప్పారంటే
శివకందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా మను చరిత్ర. ఈ మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియలిస్టిక్ లవ్‌స్టోరీగా డైరెక్టర్ భరత్ పెదగాని మను చరిత్ర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మను చరిత్ర షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.
మనుచరిత్ర సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ జోనర్ లో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాను యూపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా హీరో శివకందుకూరి, ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి హిట్ టీవీతో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.