Girl Spotted Using Hair Straightener Inside Delhi Metro
Viral Video: ఢిల్లీ మెట్రో.. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడం ఏమో కానీ.. తరచూ కాంట్రవర్సీలకు కారణం అవుతోంది. ఢిల్లీ మెట్రో గత 20 ఏళ్ల నుంచి సర్వీస్ ఇస్తోంది. కానీ ఇటీవల కొందరు చేష్టలతో ఆ పేరు పోతుంది. కొందరు ఫైట్ చేస్తే.. మరికొందరు డ్యాన్స్ చేస్తారు. ఇంకొందరీ డ్రెస్సింగ్ తీరు బాగుండటం లేదు. ఇటీవల ఇద్దరు యువకులు (men) డోర్ వద్ద కాలు పెట్టి.. ఆడుకున్నారు. అలాంటి ఘటనే మరొటి జరిగింది.
ఇంట్లో బిజీ
మెట్రోలో (Metro) ఓ యువతి ట్రావెల్ చేస్తోంది. ఇంట్లో పనిలో బిజీగా ఉందెమో.. లేదంటే ఇతర కారణమో తెలియదు.. కానీ ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్టెయిటెనింగ్ చేసుకుంది. మొబైల్, ల్యాప్ ట్యాప్ చార్జీంగ్ కోసం ఇచ్చిన సాకెట్లో మిషిన్ పెట్టి.. హెయిర్ చక్కగా చేసుకుంటుంది. ఆమె పక్కనే చాలా మంది ప్యాసెంజర్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ తనకేం తెలియదు అన్నట్టు బిహేవ్ చేసింది. 15 సెకన్ల నిడివి గల వీడియో ఇంటర్నెట్లో ట్రోల్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.
మెట్రోలో వేరే లెవల్
ఢిల్లీ మెట్రో (Metro) విషయం వేరేలా ఉంటుంది అని రాసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె తీరును చాలా మంది తప్పుపట్టారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల తీరు అదుపుతప్పినట్టు అనిపిస్తోంది. నలుగురిలో ఎలా ఉండాలనే అంశంపై పేరంట్స్, టీచర్స్ పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. మరొ యూజర్ ఇలా రాశారు. ఆమెకు ఇంట్లో సమయం లేదు కావచ్చు అని సెటైర్ వేశారు.
పవర్ లేదు కావొచ్చు
మూడో వ్యక్తి మాత్రం కాస్త జాలి చూపించారు. గతంలో జరిగిన ఘటనలతో పోలిస్తే ఇది నయం. ఆమె వ్యక్తిగత జీవితం ఏంటో మనకు తెలియదు. ఆమె బిజీగా (busy) ఉండొచ్చు.. లేదంటే ఆమె బయలుదేరే సమయంలో ఉండే చోట విద్యుత్ ఉండకపోవచ్చు.. అందుకే ఇలా ఆలోచించింది.. గతంలో కంటే ఇదీ నయమే అని రాశారు. ఢిల్లీ మెట్రోలో ఏదైనా సాధ్యమే.. ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉచితాలు ఇవ్వడం మానాలని సూచించారు.