MBNR: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో శుక్రవారం జరిగిన క్రయవిక్రయాల్లో వేరుశనగ, మినుములకు ఆశాజనకమైన ధరలు లభించాయి. మార్కెట్ అధికారుల వివరాల ప్రకారం.. వేరుశనగకు వివిధ క్వాలిటీలకు అనుగుణంగా మంచి ధరలు నమోదయ్యాయి. అలాగే, మినుములకూ సంతృప్తికరమైన ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్కు భారీగా పంట తరలివచ్చిందని అధికారులు తెలిపారు.