KMM: చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ రామారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు వివరాలు, రికార్డులను పరిశీలించి కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఔషధాల లభ్యత, కొరత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.