ELR: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో శ్రీహరి హెచ్చరించారు. ఇవాళ ఉంగుటూరు మండలం తల్లాపురం, అప్పారావుపేట గ్రామాల్లో ఆయన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి రంగులోకి పారిశుధ్య రధాలు వస్తున్నాయన్నారు. ఆయన వెంట ఉంగుటూరు ఎంపీడీవో జీఆర్ మనోజ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.