శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో దొంగతనం జరిగినట్లుగా భావించిన బంగారు పూత పూసిన విగ్రహాలు, తలుపులను రాగి రేకులుగా మార్చి మోసం చేశారని సిట్ నివేదిక వెల్లడించింది. ఈ కేసులో పలువురు మాజీ అధికారులను.. సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.