ASR: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టబ్బాయి అన్నారు. శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం అంతా పండుగ సందడి, సాంస్కృతిక ఉత్సాహంతో మార్మోగింది.