సత్యసాయి: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి సూచించారు. ఇంట్లో నగదు, బంగారం ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.