MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినిలకు ముగ్గుల పోటీలను, బాలురకు పతంగుల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యమని ఉపాధ్యాయుడు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఉపాధ్యాయుడు బిక్కు బహుమతులు అందజేశారు. ముగ్గులతో పండగ వాతావరణం నెలకొంది.