NLG: ఆర్టీసీ నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. నల్గొండ రీజియన్ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి డిపోల నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుండి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.