న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో తొలి 3 మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమైనట్లు BCCI ప్రకటించింది. ఫిట్‌గా ఉంటే మిగతా 2 మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అయితే నిన్న తిలక్‌కు సర్జరీ జరిగిందని, ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. కాగా ఈ నెల 21నుంచి IND vs NZ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.