BPT: దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బుధవారం రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపకరణాల క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించి త్వరలో వారికి ఉపకరణాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.