E.G: రాజమండ్రి ONGC కాంప్లెక్స్ గ్రౌండ్లో నిర్వహించనున్న ‘వాజ్ పేయి క్రికెట్ టోర్నమెంట్’ను గురువారం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె క్రికెట్ బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.