SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ స్టేజ్ వద్ద మంగళవారం బైకును బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. పందిళ్ళ గ్రామానికి చెందిన హనుమండ్ల రాజిరెడ్డి (76) హుస్నాబాద్ నుండి పందిళ్ళకు వెళ్తుండగా ఎదురుగా వస్తుందో ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు విద్యుత్ శాఖలో పనిచేసి పదవి విరమణ పొందినట్లు సమాచారం.