పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్… మూడో వివాహం చేసుకున్నారు. వయసులో తనకన్నా 13ఏళ్లు చిన్నవాడు అయిన మిర్జా బిలాల్ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. అతను యాక్టర్, మోడల్ కావడం గమనార్హం. తమ పెళ్లి ఫోటోలను రేహమ్ ఖాన్…. సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రెహమ్ ఖాన్ భర్త మీర్జా బిలాల్ పాకిస్తాన్ మూలానికి చెందినవాడు. కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. మీర్జా బిలాల్ వయస్సు 36 సంవత్సరాలు. రెహమ్ ఖాన్‌తో పాటు మీర్జా బిలాల్‌కు కూడా ఇది మూడో వివాహం కావడం గమనార్హం. అమెరికాకు చెందిన మాజీ మోడల్ అయిన బిలాల్.. ప్రస్తుతం కార్పొరేట్ ప్రొఫెషనల్. పాకిస్థాన్ టీవీ జర్నలిస్ట్ అయిన రెహమ్ ఖాన్‌కు 2015 జనవరిలో ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. ఈ పెళ్లి మూణ్ణాళ్లకే పెటాకులయ్యింది. స్పర్ధలతో పది నెలలకే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉంది రెహమ్.